తన కోసం చూస్తూ
11 August 2006
తన కోసం చూస్తూ
తన కోసం చూస్తూ నే తలవాటిక నిలుచున్నా!
చిన్నప్పుడు ఆటలాడి పెద్దయాక పాటపాడి ముద్దుగ తను మాటలాడు ముచ్చటైన ఆ చిన్నది తప్పక తను వస్తుందని తలవాటిక నిలుచున్నా || తనకోసం ||
చిన్ననాటి స్నేహానికి మొన్నటితో స్వస్తి చెప్పి నిన్న కన్ను గీటగానె నన్ను కోరుకుంటూ తను నా కోసం వస్తుందని తలవాటిక నిలుచున్నా || తనకోసం ||
చిన్న మాట అన్నానని కన్నుల్లో నీరునించి చిన్నబుచ్చుకోని తాను నన్ను వీడిపోగానే తను రాదని తెలిసి నే తలుపు మూసి పడుకున్నా!!